కథలు

పేగుబంధం

'కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?' గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది. 'నిన్నే అడిగేది?' అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు