సమీక్షలు

మోదుగుపూల కవిత్వపు జడివాన

సంఘర్షణ తీవ్రమైనట్లుగానే ఉద్యమ ఆకాంక్షలు సమాజంలో బలపడతాయి. దీని ప్రతిఫలం సాహిత్యంలోనూ కనిపిస్తుంది ‘‘జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుని సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతనిలో పెంపొందించింది. అవబోధనాశక్తి, భావనాశక్తి. అవబోధనాశక్తి అంటే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాంఘిక జీవిత వాస్తవాల్ని పరిశీలించి, పోల్చి అధ్యయనం చేసే శక్తి. భావనాశక్తి అంటే విషయాలకీ ప్రకృతి మూలశక్తులకీ మానవ లక్షణాలనీ అనుభూతులనీ, ఆమాటకొస్తే అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట’’ అని గోర్కీ  అంటారు. అవబోధనాశక్తి, భావనాశక్తులు రెండూ పల్లపు స్వాతి రాసిన మోదుగుపూల వాన కవిత్వం అంతటా నిండుగా పరచుకొంది. ఇరవై చిన్న కవితలున్న
వ్యాసాలు

సాహిత్య విమర్శలో కేతు

1980`81 విద్యా సంవత్సరంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు పాఠశాల క్లాస్మేట్‌, డిగ్రీలో సీనియర్‌ అయిన పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలో అడుగుపెడుతున్న సందర్భం. ఆ సమయంలో సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటి అనే చర్చ వచ్చింది. దానికి సమాధానంగా కొకు సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంకలనం మాకు బాగా పనికి వచ్చింది.  దాన్ని చదువుకున్న తర్వాత ప్రాథమికంగా సాహిత్యం రాజకీయాలు కలిసే ఉంటాయని స్పష్టతకు వచ్చాం.  ఆ వ్యాసాల సంకలనకర్త కేతు విశ్వనాథ రెడ్డి గారు. అప్పుడు మొట్టమొదట ఆయన పేరు విన్నాం. ఆ తర్వాత కొకు సాహిత్య
కొత్త పుస్తకం

రాయలసీమ ‘సాధన’ నవల

రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత  అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ.  ఇది వరకు చారిత్రక నవలలు, మనో  వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్‌ ఉంచారు.             కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా