వ్యాసాలు

విప‌త్తు అంచులో మాన‌వాళి

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ , నీటి ఆవిరి  సమతుల్యంగా ఉండాలి.  ఈ సమతుల్యత జల  వలయం సాధారణ వర్షపాతం, జంతువుల  మొక్కల జీవిత చక్రాలకు సహాయపతాయి.   పర్యావరణ సమతుల్యం వన్యప్రాణి మరియు వ్యవసాయానికి  మానవుని అభివృద్ధికి సహాయపడుతుంది.  కాలుష్య కారకాలను  వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం  అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం.  వ్యవసాయ గృహ నిర్మాణం అటవీ నిర్మూలనకు దారితీ స్తున్నాయి.