సాహిత్యం కవిత్వం

అత్యంత సున్నితమైనది

పలకమీదఅక్షరాలనుతుడిపేసినట్టుహృదయంలోబంధాల జ్ఞాపకాలనుచెరిపేయగలమా..! అంతరంగంఅర్ధమైనప్పుడుఆశ శ్వాసఅందనంత దూరమైపోతుంది..! అబద్దాన్నినిజంగా నమ్మించొచ్చునిజాన్నిఅందరికితెలియనీయకపోవచ్చుఎల్లప్పుడుచికటేవుండదుగా..! తనడప్పుదరువునీ గుండెను తాకలేదా..?తనగొంతులో గానంనీ చూపు దిశను మార్చలేకపోయిందా..? తను నీవొడిలో తలవాల్చిబిడ్డలా వొదిగిపోయినప్పుడునువు తలనిమిరింది నాటకమేనా..? మానవ సంబంధాల్లోఅత్యంత సున్నితమైనదిసహచరి సహచరుడు బంధమే..! దానిని గండ్రగొడ్డలితో నరికిఅందరిని ఆశ్చర్యంలోముంచేసిన అమావాశవి..! ప్రజలదారిలో నీ నడకలేదనికాలక్రమంలో బహిర్గతమయ్యింది..! ఏబంధం లేని కరచాలానికేకలచివేస్తున్నప్పుడుకనుపాపలా చూసిన చూపుకికన్నీరే మిగిల్చావు..!
సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
సాహిత్యం కవిత్వం

కనుపాపల్లోనుండి

మా ఇంటిముందురోడ్డువారగా గులాబీ చెట్టుచెట్టు చిన్నదేగానిగుత్తులుగా పువ్వులుఅటుగా వెళుతున్న అందరినిపలకరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ చెట్టు పువ్వులపై పడిన కళ్లల్లో ఆశ్చర్యంపెదాలపై దరహాసం నడిచివెళుతుంది ఒక పువ్వు కోసుకోమంటారా!అటుగావెళుతున్న ఒక కేకఆపిలు విన్నప్పుడెల్లావినకుడాని మాటేదో విన్నటు చిరాకు వద్దులే అనిసున్నితంగా తిరస్కరించినప్పుడుఆకేకనిరాశగానిట్టూర్పుతోవెనుదిరిగి వెళ్లిపోతుంటేపువ్వులు ఊపిరి పీల్చుకుంటూఒక కృతజ్ఞతనునా మీదకు విసిరేసేవి ప్రకృతిని శ్వాసించనివికృతదేహాలుపువ్వుల ప్రమేయంలేకుండావాటిని తాకుతున్నపుడుకాళ్ళకింద నలిపేస్తున్నప్పుడునిరశిస్తాయినినదిస్తాయియుద్దాన్ని ప్రకటిస్తాయి పువ్వులు లేనితోటపువ్వులు లేనిఇల్లుమబ్బులుకమ్మిన ఆకాశమే పువ్వులుఆహ్లాదాన్నిస్తాయిపువ్వులుఆనందాన్నిస్తాయి పువ్వులువడలిపోయి రాలిపోతున్నప్పుడుఎన్నటికీకనిపించకుండాపోతున్న బిడ్డల్లా అనిపిస్తాయి ప్రకృతినిఅమితంగా ప్రేమించే సూర్యంచెట్టునిపువ్వుల్నితన మొబైల్ ఫోన్ కెమెరాలోజ్ఞాపకాలుగా దాచుకున్నప్పుడుచెట్టుచెలిమిచేసింది శృతి చెట్టుని దాటుకుంటూ లోనికివస్తున్నప్పుడుచెట్టే తనని పాలకరించిందో!శృతియే చెట్టుని పాలకరించిందో!ముందుఎవరిని ఎవరు పలకరించిపరిచయం చేసుకున్నారోగానిసూర్యం శృతి అమరులయ్యాకచెట్టుదుఃఖమయ్యిందికన్నీళ్ల
సాహిత్యం కవిత్వం

వెన్నెలపంట

ఒకేసీటులోపక్కపక్కనే కూర్చుంటాంవందలకొద్ది మైళ్ళుకలిసే ప్రయాణిస్తాంహలొఅంటే హలొమీరెక్కడిదాకాపలాన వూరుఅంతేమాట్లాడటం ముగుస్తుంది నాచేతిలో సెల్ ఫోన్పక్కనవ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ఇద్దరితలలు ఓరిగిపోతాయి ఇక్కడదూరంలో ఉన్న వ్యక్తితో సంభాషణఅక్కడఎక్కడోవున్న వ్యక్తితో సంభాషణఇక్కడవీడియోగేమ్స్అక్కడఫేస్ బుక్ఇక్కడట్విట్టర్అక్కడవాట్సప్ యూట్యూబ్ గూగుల్ సెర్చింగ్ లునచ్చిన వాటిని వెదుక్కునివాటిల్లో లీనమవుతాం గ్రామాలను దాటుతాంపట్టణాలను దాటుటాంతలపక్కకుతిప్పికిటికిలోనుండి బయటకు చూసినప్పుడుఅనేక దృశ్యాలుతెరలు తెరలుగా ఎదురవుతాయి వర్తమానంలోకి వచ్చిఎవరిని చూసినారంగులు పూసుకున్న మొఖాలే చిరునవ్వుకిచిరునామలేని ప్రతిభింభాలు కాలానికి కళ్లెం లేదుభద్రతకు భరోసాలేదుఅంతాపల్లెరుకాయల పరాకు దుఃఖాలు ఎదురుపడతాయిసోకాలు ఎదురుపడతాయిఅన్నింటినిచూస్తూనే దాటిపోతుంటాంస్ఫురణలోకి వచ్చినప్పుడుఎదురుపడిన దృశ్యాలునిమిషమోఅరనిమిషమోబాధను కలిగిస్తాయి గమ్యం చేరువయ్యిందిఎవరిదిశగావారు వెళ్లిపోతున్నదారిలోనీడలు కనుమరుగయ్యాయిఅంతా గాఢాంధకారంనిశరాత్రిలోనిశ్శబ్దమేతప్పాతీతువుపిట్ట అరుపులులేవు అందరుఅందరిలోవున్నాప్రతిఒక్కరినిఒంటరితనం వెంటాడుతున్న క్షణానవెన్నెలపంటకోసం నేను