వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది