వ్యాసాలు

94 ఏళ్ల ‘గ్రోవ్’ వాసు అరెస్టు-విడుదల

ఏడేళ్ల నాటి కేసులో ఇటీవల అరెస్టయిన 94 ఏళ్ల కేరళ మానవ హక్కుల కార్యకర్త  'గ్రోవ్' వాసు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బెయిల్ తీసుకో నిరాకరించాడు. అనేక మంది న్యాయవాదులు, సహచరులు, పోలీసులు, కార్యకర్తలు జైలుకు వెళ్ళకుండా ఉండటానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కాని వాసు ‘నిరసన అనేది నేరం కాదు’ అనే తన రాజకీయ వైఖరిపై ధృఢంగా నిలబడ్డాడు.   ఎన్‌కౌంటర్ జరిగిన రోజున వాసు మీడియాతో మాట్లాడుతూ, "ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మేము నమ్ముతున్నాము. ఎన్‌కౌంటర్ అరిగిన తరువాత పాత్రికేయులను ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేరే
వ్యాసాలు

కుకీలకు మద్దతిచ్చినందుకు కోర్టు సమన్లు

'ది వైర్' కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్; కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ; కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి విల్సన్ లాలం హాంగ్షింగ్ లకు ఇంఫాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కరణ్ థాపర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆ ముగ్గురూ మణిపూర్ కుకీ సముదాయానికి  ప్రత్యేక పరిపాలన ఉండాలనే డిమాండ్‌కు మద్దతునిచ్చారు. దీనితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పలు ఐపీసీ నిబంధనల కింద వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హౌసింగ్ పై మెయితీ ట్రైబ్స్
వ్యాసాలు

భద్రతా బలగాలు వైమానిక  బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?

ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు
నివేదిక

ఒడిశాలోని ఆదివాసీ గూడాల్లో  ఆహార సంక్షోభాన్ని బహిర్గతం చేసిన  ఓ చిన్నారి మరణం

ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్‌ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా
నివేదిక

కోల్హాన్ యుద్ధ నివేదిక

జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,