ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
కథావరణం

రైతు జీవిత చిత్రణలో రచయిత్రులు

 'మంచిదయ్యా మీరెల్లబారితే నేనూ నా పనికి పోతా' అంటుంది హనుమక్క . గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో  పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని   కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ. రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది,
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల
కవిత్వం

“రద్దు”

నగ్నంగా ఊరేగించబడింది అత్యాచారం గావించబడింది అత్యంత దారుణంగా హత్యగావించబడింది ఆదివాసీలు, అడవి బిడ్డలు మాత్రమే కాదు. ఇంకేదో.. ఇంకా ఏదో, ఏదేదో... * బలహీనుల ఎదుట అధికారం అస్సలు మాట్లాడదు నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకుంటూ వెడుతుంది. హక్కుల్నే కాదు మాన ప్రాణాల్ని రద్దు చేసేస్తుంది మీరింకా పాఠాలు మాత్రమే మారిపోయాయని, అనుకుంటున్నారు. చిన్నప్పటినుండి చేస్తున్న 'ప్రతిజ్ఞ 'ను కూడా మార్చేసిన విషయం ఇంకా తెలియదు. మనుషులందరూ సమానం కాదని అందరూ సోదర సోదరీమణులు కాదని అందరికీ హక్కులు ఉండవని వాళ్లు కొత్త గొంతుతో ప్రతిజ్ఞ మొదలుపెట్టేశారు * నోట్ల కన్నా ముందే స్త్రీత్వం, మనిషితనం ఆత్మగౌరవం,
కవిత్వం

పలమనేరు బాలాజీ కవితలు మూడు

1. లేనప్పుడు " అప్పుడు గాలి చొరబడదు మాట నిర్మాణం కాదు మనిషి లేనప్పుడే ఉనికికి అర్థం, విలువ! అప్పుడు రాత్రి ఎంతకూ కదలదు రాత్రంతా.. వస్తువులు మాట్లాడుతుంటాయి మనిషి లేనప్పుడు వస్తువులు పుస్తకాలు బొమ్మలే మనుషులవుతాయి, మాటలవుతాయి. అప్పుడు ఏదీ కుదరగా ఉండదు ఎడబాటు తర్వాత సుదీర్ఘ తడబాటే! అప్పుడు పొలమారినట్టు , పొగ చూరినట్టు, మబ్బు కమ్మేసినట్టు కళ్ళ ముందరి వాళ్ళు కన్నీటి పొరలైనట్టు... అప్పుడు మాట్లాడనీ, పోట్లాడనీ అలగనీ, అదిరించనీ, బెదిరించనీ,భయపెట్టనీ.. నీ... నీ...నీ..... అప్పుడు లోకంగా,ప్రాణంగా,దేహంగా ఉండనీ... మనసుని, మనిషినీ, మనసైన మనిషినీ !! 2. కొత్తగా.. ప్రేమించే వాళ్ళు కాబట్టే -వాళ్ళట్లా
సాహిత్యం కథావరణం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం
కాలమ్స్ కథావరణం

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?" సమాజంలోని అసమానతల కారణంగా అభివృద్ధికి చాలా దూరంలో ,చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన దళితుల గురించిన ఆత్మగౌరవ కథలు ఎన్నో వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఈ రకం ఆత్మగౌరవ కథలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. తమ పరిస్థితుల గురించి స్వానుభవంతో వ్రాసుకున్న రచనలు. పరోక్షంగా సామాజిక సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకుని సహానుభూతితో రాసిన రచనలు. నంబూరి పరిపూర్ణ గారి కథాసంపుటి "ఉంటాయి మాకు ఉషస్సులు" లోని ఈ కథ పేరు "అనల్ప పీడనం" . అసలు సమాజంలోని అసమానతలకు కారణం అయిన  కులవివక్షత ఎలా మొదలైంది? కులం ఎలా
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల