కవిత్వం

పల్లిపట్టు నాగరాజుమూడు కవితలు

1 కుటిలమేధయాగం -------------------------- కంటిలో నలుసట్టా పడితేనే కళ్లు రుద్దుకునే మనం పొరకముల్లు గుచ్చుకుంటేనే వెదికి మరీ తీసిపారేసే మనం * బతుకుదారుల్లో బలిజముళ్లను చల్లుతుంటే బర్రిమీద వానకురిసినట్లుండమే అర్థంగావట్లేదు.!? * మనిషితనానికే శత్రువయినోడు మనుషుల బాగెట్టా ఆలోసిస్తాడు మనిషి మెదడు ప్రాణంతో కదలటం సహించలేనోడు మనిషి బుర్రకు పదునుపెట్టే సదువెట్టా వుండనిస్తాడు * కాయని కాయని పండుని పండని ఉన్నదున్నట్టు కంటితో చూడలేని కుంటిచూపులోడు మురికిని మురికని చెబితే ఒప్పుకుంటాడా.? అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?! చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా?? * దీపాలు వెలిగే దారుల్ని