కాలమ్స్ కవి నడిచిన దారి

మిట్టిండ్ల క‌య్య‌ల నుంచి..

బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,! అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటూ... నేను