సంభాషణ

పోరుకు ప్రేరణనిచ్చే మేడే

మేడే అమరగాథ నేటికి 136 ఏండ్ల క్రితం 1886లో మే 1న అమెరికాలోని చికాగో నగర కార్మికులు 'ఎనిమిది గంటల పనిదినం' కోసం చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికారు. ఆ రోజుల్లో పని గంటలకు ఏ నియమమూ లేకుండింది. పొద్దు పొడిచింది మొదలు చీకటయ్యే దాకా కార్మికులు కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ వుండేవాళ్లు. ప్రారంభ దినాల్లో అమెరికాలో కార్మికులకు రోజుకు 12 నుండి 18 గంటల వరకూ శ్రమించవల్సి వచ్చేది. అత్యధిక కార్మికులు చిన్న వయసులోనే ప్రమాదకరమైన రోగాల బారినపడేవారు. చనిపోయేవారు కూడా. దీనికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులపై  ప్రైవేటు గూండాలూ, పోలీసులూ, సైన్యంతో దాడులు చేయించేవాళ్లు. పరిస్థితి