సాహిత్యం కథలు అల‌నాటి క‌థ‌

గుమ్మ‌న్ ఎగ్లాప్పూర్ గ్రామ‌స్థుడు

ఉద‌యం లేచింది మొదలు లింగన్న మనసంతా కకావికలమైపోతోంది. వర్షాకాలం, అడవి పచ్చగా వుంది, రాత్రి కురిసిన వర్షానికి నేలంతా బురదబురదగా వుంది. కురిసి కురిసి లింగన్న గుడిసె చెమ్మగా వుంది. ఏడేళ్ళ కూతురు ఆకలితో ఏడుస్తోంది. పదేళ్ళ కొడుకు ఆకలిగా మూలుగుతున్నాడు. లింగన్న భార్య లచ్చిమి బాలింత జ్వరం యింకా తగ్గినట్టులేదు. లింగన్న తల్లి ఎల్లవ్వ కాలుకున్న మానని గాయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. పొయ్యిమీద అంబలి కుండ ఎక్కించడానికెవరూ లేనట్టుగా వుంది. అందరూ నిస్సత్తువగా వున్నారు. లింగన్న లేవడంతోనే కన్పించిన దృశ్యాలివి. ఇక ఎక్కువసేపు ఆ గుడిసెలో వుండలేకపోయాడు. అలవాటుగా బయటకు నడిచాడు. మబ్బులచాటునుండి సూర్యుడిరకా బయట