సాహిత్యం సంభాషణ

ఛైర్మన్ గొంజలో వర్ధిల్లాలి , అతని శక్తివంతమైన, ప్రభావశాలియైన ఆలోచనా విధానం వర్ధిల్లాలి!

సాధారణ రాజకీయ పంథాలో ఛైర్మన్ గొంజలో వివరణలు,  ప్రపంచ విప్లవానికి అందించిన రచనలు: మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం లేకుండా, గొంజలో ఆలోచనా విధానాన్ని ఊహించలేము, ఎందుకంటే అది మన వాస్తవికతక మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు సృజనాత్మక అనువర్తనం. శ్రామికవర్గ భావజాలపు చారిత్రక అభివృద్ధిని, మావోయిజం ప్రధానమైనదిగా ఆ భావజాలం మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా రూపుదిద్దుకున్న మూడు దశలను అర్థం చేసుకోవడం అనేది ఇందులో కీలకాంశం. సారాంశంలో, మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని ఒక విశ్వజనీన సత్యంగా పెరూ విప్లవ నిర్దిష్ట  పరిస్థితులకు అన్వయించడం అనేది ప్రధానమైనది. అందువల్ల గొంజలో ఆలోచనా విధానం పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విప్లవానికి ప్రత్యేకంగా ప్రధానమైనది. గొంజలో ఆలోచనా విధానంలోని