సాహిత్యం కవిత్వం

వసంత మేఘమై కురస్తాం.

దిగులు పడకు నేస్తంవర్గ పోరాటాల చరిత్ర మనది.రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.తూర్పు పవనానాలువికసిస్తున్నాయి.అక్రమ చట్టాలతోమతాల మరణహోమం జరుగుతున్నది.బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థలకుళ్లును కడుగుదం.రండి నేస్తం…త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.నేల రాలిన చోటపువ్వులు వికసిస్తున్నయ్.కష్టాలు కన్నీళ్లు లేనిసమాజం కోసం కవాత్ చేద్దం..రేపటి వసంతం కోసంకదలి రండి .మరో వసంత మేఘమై కురస్తాం…..
సాహిత్యం కవిత్వం

విత్తనం పుట్టక మానదు

నెత్తు రోడ్డుతున్న నేలపై విత్తనం పుట్టక మానదు. పదునెక్కిన నేలపైన వసంతమై చిగురిస్తుంది  ఒకట రెండ ఎన్నో నింగి నేల నిండ నిండు త్యాగం. పుట్టుక కోసం పురటి నొప్పుల దారి పురుడు పోసుకుంటున్నది కాలం కౌగిలిలో గింజకుంటున్న హృదయాలు చరిత్ర దారిలో చెదరి పోవు ఆకాశం హద్దు లేకుండ తూర్పు కిరణాలు   ప్రసరిస్తయ్ ఎర్రపూలవనంలో పిడికిళ్ళు బిగుసుకుంటయ్ త్యాగాల దారిలో...
సాహిత్యం కవిత్వం

అతడు రేపటి పొద్దు

మరణం మౌనం కాదునిశ్శబ్దన్ని బద్ధలుకొట్టడమే.ఆశయం కోసం నడిచి అలసిపోలేదు,ఆరిపోలేదు.అడుగుల చప్పుడు ఆశయం కోసం వినబడుతూ వున్నాయి. చెదలు పట్టిన సమాజం నుచర్చలతో ఛేదించలేమన్నారువిఫలం అయితేవిప్లవమే అన్నాడు.యుద్ధంకోసంమాటీచ్చి మరిచిపోలేదు.వాగ్దానంగనిలబడ్డాడు. మృత్యువు ముచ్చట పెట్టినచివరిరక్తం బొట్టుచిందించిండు.మాయదారి రోగంమందలించినపోరుదారికి మరణంలేదన్నడు. చిగురించిన వసంతములోమేఘమై కురుస్తానని.రేపటి పొద్దుకుమాటిచ్చిన వీరుడతడు. 15-10-2021