సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ
కథలు “మెట్రో జైలు” కథలు సాహిత్యం

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
ఇంటర్వ్యూ

భారతదేశ మహిళా ఉద్యమంపై బి. అనూరాధ ఇంటర్వ్యూ

భార‌తదేశ మహిళా ఉద్యమాన్ని ఎన్ని దశలుగా చూడవచ్చు? 1857 లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటినుండీ 1947 వరకు జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లోనూ “స్వాతంత్రోద్యమంలోనూ” మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగినవిధంగా ఉంది. ప్రత్యేక మహిళాఉద్యమంగా రూపొందకపోయినా ఆ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా వారు పితృస్వామ్యాన్ని ఢీకొన్నారు. వారి భాగస్వామ్యం అర్జీలు, విన్నపాలు సమర్పించడం దగ్గర నుండి, ఊరేగింపులూ పికెటింగ్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, స్వచ్ఛంద అరెస్టులు తదితర రూపాల్లో కొనసాగడమే కాకుండా జాతీయ విప్లవకారులుగా సాయుధచర్యల వరకూ అన్నిటిలో పాల్గొన్నారు. 1917 నుండే అఖిల భారత స్థాయిలో మహిళా సంఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వాతంత్ర పోరాటంలోనూ కొంత