వ్యాసాలు

‘మే డే’, భారతదేశ శ్రామికులు.

ఒక పక్క, దేశమంతా ఎండలు భగ భగ మండుతున్నాయి. మండుతున్న సరుకుల ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. ఈ మంటలకు భారతదేశ శ్రామికులు కుతకుత ఉడికిపోతున్నారు.  మరో పక్క, దేశం ప్రయివేటీకరణ వెల్లువలో కొట్టుకుపోతోంది. గుప్పెడు పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రజా సంపద అంతా ప్రవహిస్తోంది. 75 ఏళ్లుగా పార్లమెంటరీ ఓట్ల రాజకీయం దేశంలో నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి అమృతోత్సవ పండగ.  ప్రజలు నమ్మి, ఓట్లేసి, గెలిపిస్తున్న పార్లమెంటరీ  పార్టీలు, పాలనా వ్యవస్థలు.. శ్రామిక ప్రజా శ్రేణులను స్వాతంత్రం, గణతంత్రం, రాజ్యాంగం సాక్షిగా వంచిస్తూనే ఉన్నాయి. సామాజిక సంపదను వ్యక్తిగత సంపదగా మార్చుకునే క్రమాన్ని అవిరామంగా కొనసాగిస్తు న్నాయి. ఇప్పుడు