కొత్త పుస్తకం

హిందూమతం అబద్ధమని ఒప్పించే రచన

సి.యస్‌.అర్‌.ప్రసాద్‌ అనువాదం చేసిన  దివ్యా ద్వివేది, షాజ్‌ మోహన్‌, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది.             హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు.  హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక  భౌతిక వాద దృక్పథంతో,  మార్క్సియన్‌ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి  భారతీయ హిందూత్వ ఆధిపత్య
వ్యాసాలు

సృజనాత్మక విమర్శ

‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక.  ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు  తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు.  నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి  విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక  వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది.             ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ
సాహిత్యం సమీక్షలు

అనేక ఎరుక‌లు

మొత్తం పదకొండు కథల విశ్లేష‌ణ‌ ఈ క‌థ‌ల పేర్లే చాలు ఏదో  కొత్త దనం.   కథలు   సులభంగా నడిచాయి. ఇతివృత్తాలు అంత గంభీరమైనవి. అంత సారవంతమైనవి. జీవితాలను ఆవిష్కరించాయి.  రచయితల భాష సరళమైనది. ఆకర్షణీయమైనది. కఠిన పదాలు లేవు.  పదప్రయోగ వైచిత్రి కై పెనుగులాట కనిపించవు.  చదువరుల‌ను ఆలోచింపజేస్తాయి. విసుగు అనిపించదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని మాండలిక సౌరభమంతా  మాండలికాల వ‌ల్ల  క‌థ‌ల్లోకి వ‌చ్చింది. అదే ఒక నిండుదనం తెచ్చింది. చిన్న కథలలో ఆవేదన, విషాదం తో బాటు ఆవేశం అగ్ని ప్రవాహంగా తన్నుకు వస్తాయి. ప్రతి కథలో స్పష్టమైన లోతైన వాడైన ఆలోచనలతో పాటు వర్తమానాన్ని అద్దంలా