తండ్రి తొవ్వలో
మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥మున్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥మున్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం ॥మున్నా॥ పృథ్వంటు ఒక పేరు