సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం