సమీక్షలు

రెప్పవాల్చని చూపు          

 'అట్టడుగున అందరమూ మానవులమే' అన్న కవి మాటల్లో జీవశాస్త్రపరమైన అర్ధానికి మించిన సామాజిక మానవసారం ఇమిడి ఉంది. అటువంటి ప్రాకృతిక మానవసారంతో తొణికి సలాడే మనిషి కేంద్రంగా రాసిన కవిత్వమే మిత్రుడు ఎన్. వేణుగోపాల్ 'రెప్పవాల్చని కాపలా'.  మరి కవి వేణుగోపాల్ పావురపడే మనిషి ఎవరు? ఆ మనిషి అతడు కావచ్చు. ఆమె కావచ్చు. మరి అతడు/ ఆమె కేవలం ఒక్క వ్యక్తేనా? కానే కాదు. మనిషి అస్తిత్వానికి ఏకరూపం లేదు. బహు రూపాలు ఉన్నాయి. అనంతమైన భిన్నత్వం ఉంది. కనుక సహజంగానే మనిషి ఆలోచనలోను, ఆచరణలోనూ అటువంటి విభిన్నత్వమే ఉంటుందని ఈ కవి భావిస్తాడు. అయితే ఆయనకు
లోచూపు

చరిత్ర పొడవునా ఫాసిజం

చారిత్రక కారణాలు ఏవైనా ఫాసిజం మన సామాజిక సాంస్కృతిక నేలలోనే మొలిచే విషపు కలుపు మొక్క. దానిని సకాలంలో గుర్తించి పెరికి వేయకపోతే పచ్చని పంట నాశనం అవుతుంది. సాధారణ కలుపు మొక్కలను ఏరివేయకపోతే పంట ఏపుగా పెరగదు గానీ, విషపు కలుపు మొక్క(ల)ను ఏరివేయకపోతే పంట నాశనం అవ్వడమే కాకుండా, నేల కూడా విషపూరితమై భవిష్యత్తులో ఏ పంటా పండని ప్రమాదం తలెత్తుతుంది. అటువంటి మనిషి మౌలిక మనుగడకే ప్రమాదకరమైన ఫాసిస్ట్ ఆక్టోపస్ తన విషపు కోరలతో మన దేశాన్ని కబళిస్తోంది. నిజమైన సంస్కరణోద్యమ పోరాటాలు, లౌకిక, ప్రజాస్వామిక, సమూల పరివర్తనా(విప్లవ) పోరాటాలు చాలా కాలంగా జరుగుతూనే
సమీక్షలు

దాచేస్తే దాగని యుద్ధం 

ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి.  ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు   నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి.    రాజ వంశీకులకు    ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక
సమీక్షలు

జీవిత కథలు

ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత
సమీక్షలు

కల్లోల కాలంలో అవసరమైన సంభాషణ

విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ "50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం" అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ "కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ" అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.            పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై
కాలమ్స్ లోచూపు

వర్ణం నుండి కులం దాకా ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ

భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను 'చాతుర్వర్ణ' నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు.                                  మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం,
లోచూపు

స్వచ్ఛ భారత్లో స్వచ్ఛత ఎక్కడ’?

మన ఇంటికి గోడలు ఎంత అవసరమో కిటికీలు, దర్వాజలు అంతకంటే ఎక్కువ అవసరం. అవి లేకుండా మనం గోడల మధ్య బందీలమైతే మనను బైటి గాలులేవీ తాకవు. బయటి వెలుతురేదీ మనకు సోకదు. మన ఇంటి గోడల బయటి కైవారాలు సురక్షితంగా ఉన్నాయా, లేదా కూడా మనకు తెలియదు. కనుక మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మనం గోడలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ఇళ్లకు చెందిన బయటి గోడలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ ఇళ్ల గోడల మధ్యన ఉన్న రక్షక వ్యవస్థలను పరిరక్షించుకోవలసి ఉంటుంది. విధ్వంసక వ్యవస్థలను రూపుమాపుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాగే మన స్వీయ అస్తిత్వాలను
లోచూపు

సమాజ చలన విశ్లేషణ

మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని 'సమాజ చలనపు సవ్వడి' అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో 'సమాజ చలనపు సవ్వడి' అనే ఈ పుస్తకం
కాలమ్స్ లోచూపు

బజరా ‘మనువాచకం-స‌మ‌కాలీన అనుభ‌వ‌సారం

నేటి ఆధునిక యుగంలోనూ భారత సామాజిక జీవనం ఇంకా అనాధునికంగానే ఎందుకు ఉన్నది? ప్రగతి సూచికలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడైనా మనకు ఎదురవుతాయి. నిజానికి ప్రగతి సూచికను బట్టి చూస్తే, మన సమాజం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హేతుబుద్ధి మన సమాజానికింకా అపరిచితాలుగానే ఉన్నాయి. మరి మన దేశంలో జరిగిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమాలన్నీ సామాజిక మార్పుకు దోహదపడినవైనప్పటికీ, అవన్నీ మౌలిక సామాజిక మార్పును ఆశించి సాగినవి కావు. అలాగే ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకైనా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ,
లోచూపు

అంబేద్కర్ అస్తిత్వవాది కాదు -అచ్చమైన దేశీయ ఆధునికతా వాది

భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్. అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక 'నాగరిక' సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో