సాహిత్యం కథలు

అమ్మను చూడాలి

" ఏమిటండీ? అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉంది కదా!" జానకి అడిగింది కోర్టు నుండి వచ్చినప్పట్నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్తను. " ఇవాళ కోర్టులో ఒక వింత కేసు వచ్చింది ...""సరిపోయింది. కోర్టు పిచ్చి.. ఇంటి దాకా తెచ్చుకున్నారా? నేను ఇంకా  ఏమిటోనని భయపడ్డా !లేవండి భోజనానికి."           జానకి కోటయ్య మాటలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది .జానకి ఎప్పుడూ అంతే. తను చెప్పదలుచుకున్నది చెప్పడమే గానీ తన మాట  విన్నది ఎపుడని?  అందుకే తను మాట్లాడడమే మానేసాడు అవసరమైతే తప్ప. అప్పుడైనా తన మాట నెగ్గదు. అయినా జానకి నోటి దురుసు కు జంకి