కథనం

విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు 'నింగి-నేలా నాదే ' అన్న పరిపూర్ణ విశ్వాసంతో
సంభాషణ

మీరు నడిచినంత మేరా…

‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది. ‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన 'తురక తెలుగులా'.  . తను వచ్చిన పని
సంభాషణ

విప్లవోద్యమ వ్యక్తిత్వమే సాకేత్‌

‌అక్టోబర్‌ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి,  ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్‌, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన  ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సాకేత్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ (యస్‌.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్‌) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్‌ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.