సాహిత్యం కవిత్వం

మనుగడ కోసం – జీవిక కోసం

వారాంతపు సంతలలో మండుతున్న ధరలు అడవులలో, వూళ్లల్లో పెరుగుతున్న ఖాకీల దాడులు. బతుకు గ్యారంటీ లేని జీవితాలలో బతుకు పోరులో ముందున్నది మా తరతరాల ఆత్మరక్షణాయుధం. ఇక వెనుకున్నది జీవిక కోసం పెనుగులాటలో సగటు ఆదివాసీ సంఘర్శన ఫలం. సమాధాన్, ప్రహార్ లు రాజ్య బీభత్సానికి పేర్లేవైతేనేం! మనుగడ కోసం మా పోరాటం. జీలుగు వద్ద తేఢాలేదు. మండుతున్న ఎండల్లో రాలిపడే  పూవుల కోసం పిల్లా-జెల్లా; ఆడ-మగా అడవంతా మా గాలింపే ఆకలి తీర్చుకోవడానికి అంబలి, సేద తీర్చుకోవడానికి నీరుతో పాటు ఉత్సాహాన్ని, శక్తినిచ్చే సంప్రదాయ సేవనం – జీలుగు కల్లు జెండర్ తేడాలేమీ లేకుండా సమష్టిగా డొప్పల్లో