సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన