కవిత్వం

పాలస్తీనాతో…

1. ఉయ్యాలలెగిరి పోతున్నాయి ఈ ఆలీవ్ కొమ్మలపై వేలాడ్తున్న ఎండిన పాల చుక్క పెదవులు సగం కాలి మెతుకులు తొంగి చూస్తున్న తడియారిన నోళ్ళు కమిలి పోయి తెగిపడిన పసి ఆరని కనురెప్పలు మసిపట్టి రాలి పడిన మఖ్మల్ వేళ్ళు గోరు తగిలితే నెత్తురు కారే పాల బుగ్గల్ని మిస్సైల్ కొరికేసిన దృశ్యం ఈ గుండె మూడు నెలల శిశువుది కాబోలు ! అవి ఆటగోళీలా కళ్ళా? యుద్ధం నవ్వుతోంది ఇజ్రాయెలై ఈ ఇసుక నేల మీద పిట్టగూళ్ళలా భూమికి వేలాడ్తున్న అస్తిపంజరాలు! ఈ దుబ్బ మీది చిన్నారిఅచ్చుల పాదాలు ఎక్కడా కనిపించవేం ? లోతైన గాట్లు పడి
కవిత్వం

తలుగు తెంపుకున్నా!

మనసు లేని ధర్మం ప్రేమ లేని ధర్మం దయ లేని ధర్మం ఆలోచన లేని ధర్మం తడి తెలియని ధర్మం ద్వేషం ప్రాణమై హింసే చరిత్త్రెన ధర్మం నీ బ్రహ్మ నీ విష్ణు నీ మహేశ్వరుడు మాభుజాల మీద మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక నిచ్చెనమెట్ల స్వర్గాన్ని మీ కిచ్చారు ప్రియమైన హిందూ తాలిబన్లారా! నీ సనాతనం ఉన్నతమైతే మోసీమోసీ అలిసిపోయాం కాడి మార్చుకుందాం రండి ! మా పియ్యి ఉచ్చ మీ రెత్తిపోయండి పశువుల కళేబరాలు మోసుకెళ్ళి చర్మం ఒలిచి చచ్చిన గొడ్డు కూర తినండి మా చెప్పులు మీరు కుట్టండి మా లాగా కూటికి లేక కుమ్ముకు
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 ఆధునిక రామాయణం విద్వేషం తెంపిన తల వెదురు మనిషైంది నెత్తురొడుతున్న ప్రశ్నలా కళ్ళుమూసుకొని ఈ దేశం కళ్ళల్లోకి చూసింది మనిషిని పశువుకన్న హీనం చేసిన విలువల్ని గర్భీకరించుకున్న శవపేటిక మీది కౄరజంతువుల్ని దేశం నిండా విస్తరించిన అన్ని దిక్కుల్ని ధిక్కరిస్తూ మూసిన పెదాల్తో నవ్వింది 'అబ్దుల్ కలామ్ ప్రథమ పౌరుడైయ్యాడు గుజరాత్ ముస్లిం నెత్తుట్లో దాండియా ఆడాక దళిత రుధిరవర్షం ఉత్తర భారతాన్ని ముంచి వేస్తున్నప్పడే దళిత కోవిందు కొత్త ప్రథమ పౌరుడైయ్యాడు ఆదివాసీ ముర్ము ప్రథమ పౌరురాలైయ్యాక మరణ మృదంగ విన్యాసాలు ఆదివాసి కొండలు లోయలు అడవుల్లోకి విస్తరించాయి' హహహ అని అరిచింది కవులకు కళాకారులకు
కవిత్వం

లెక్కింపు

జవాబుపత్రకట్ట స్పర్శించగానే కొన్నిమూలుగులు వినిపించాయి అణిచిపెట్టిన రబ్బరుబ్యాండు తొలగించగానే కొన్ని ఏడ్పులు వినిపించాయి పత్రాల లెక్కిస్తుంటే కొన్ని ఎక్కిళ్ళు వినిపించాయి పత్రాల మూల్యాంకిస్తుంటే ఒక రైలుశబ్ధం పెనవేసుకున్న లేలేత మృత్యుకేక బ్రద్ధలైంది పత్రాల్లమార్కులు వేసేకొద్ది ఉరితాళ్ళవరుస పేనుతున్న ధ్వని పత్రాలపేజీలు తిప్పుతుంటే పురుగుమందులవాసనంటుకున్నగాలి పూర్తైనమూల్యాంకన పత్రాలు కింద పెడుతుంటే ఎవరో మునుగుతున్న నీటిశబ్ధం ఇంత హింసను ముల్లెకట్టుకుంటూ ప్రశ్నపత్రాలు దిద్దడమంటే భవిష్యత్తును దిద్దడమే వాళ్ళు ఆడుకున్న అక్షరాలు వాళ్ళు పాడుకున్న అక్షరాలు వాళ్ళ మీద అలిగిన అక్షరాలు వాళ్ళే మూతిముడ్చుకున్న అక్షరాలు ఏడాదంతా మోసిన అక్షరాల్ని తెల్లకాగితమంతా పండిస్తారు ఆ పంట చుట్టూ ఆశల్ని కాపలా పెడుతారు అనేక
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు

1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు
సాహిత్యం కవిత్వం

చిత్రవధ

చిత్రవధ చేస్తావనుకోలేదుకన్నీళ్లు నడిచి వస్తున్న చరితను కొన్ని రంగు పూసిన పాత్రలుఇంకొంచెం సరిగమలుకొన్ని భౌగోళిక దృశ్యాలుకథే కదా!కాకుంటేకళ్ళు మూసుకొని కళ కన్నావు విషాదం మంచు కురవడం ఎలా తెలుస్తుంది ఒక దేవాలయం ఒక మసీదు ఒక గురుద్వారా ఒక ఆరామం బతుకు వెతుక్కుంటూ భయం రహదారి నడపడం దాల్ సరస్సు దుఃఖమే !ఈ దేహావయవం అన్నందుకే కదా !ఇక్కడ పారిన నెత్తుటికి మతం లేదువయసు లేదు కాశ్మీరీయత తప్ప !నీ తెర అస్పృశ్య౼రెక్కాడితే డొక్కాడని నెత్తుటి వాసనమన ముక్కుపుటాల్లోకి చొరబడుతుంది ఈనేల ఇష్టపడిన పేర్లన్నీ ఈ మట్టిలోనే దాక్కున్నాయి మానభంగాలు మౌనభంగాలు ఎన్ని అర్ధరాత్రులు మౌనం మోశాయి రాలిన కలలన్నీ హిందువులు ముస్లిములు బౌద్ధులు సిక్కులు మరణానికి మతం లేదు కాశ్మీరీయత తప్ప !కళ్ళల్ల చెవులల్లసృజనాత్మక విషం పోసినీ మతం కోరిక తీర్చావుకన్నీళ్ళకు
కవిత్వం

కవితా పరాగం

1.  వొక నగ్నదేశభక్తి    చంపింది రైలేనా? రూపాయి రుచి ఎరుగని    చెమట చుక్కల్ని    ఆకలి నుండి ఆకలికి   అనంత యాత్త్రైన ఆకలి చేతుల్ని    ఆర్థికమొసళ్ళ నోటికందించింది     సుభాషితాల సింహాసనం! దేశం గిడ్డంగి    పేరుకుపోయిన ఆకలి నిల్వ!   గుర్తుపట్టని నట గుడ్డి    ఆహారభద్రత నిల్వ !!   దేశాన్ని పోతపోసే          చెమట చేతులు   ఆకలినదై     ముంచుతున్నప్పుడే     68,607కోట్ల నగ్న దేశభక్తి పొర్లి పొంగింది   సోకెవడిదో?   సొమ్మెవడిదో?     చెమట చుక్కలారా!    ఇంత నోరుంది     ఇన్ని అక్షరాలున్నై కాని    మీ
సాహిత్యం కవిత్వం

స్టాచ్యు ఆఫ్ అనీ క్వాలిటి

నేను మాట్లాడనునీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించినేను చర్చించనునీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించినేనేమీ అడుగనునువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి సమతామూర్తీ!నీ ఐదు వేల ఋత్వికులలోనేనెక్కడున్నాను స్వామీ! ఇంకానన్ను చీకట్లోనే ముంచునా మూర్ఖోదయాన్నే స్వాగతించు వెయ్యేళ్ల కింది నుండిఇప్పుడెందుకు నిద్ర లేచావోనాకు తెలియంది కాదు మనుషులంతా సమానమైతేనీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి మనుషులంతా ఒక్కటైతేమెడకు ముంత నడుముకు చీపురునీకాలమెందుకు మాయం చేయలే ఇంతకు"నంగిలి"రొమ్ములెందుకునెత్తుటి మేఘాలై కురిశాయి ఇవ్వాళఅయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతాఅస్పృశ్య ఆడతనంఅరణ్య రోదనెందుకైంది ని దేవుడికినా అజ్ఞానానికి మధ్యనీ కులాన్ని గురువు చేసిపౌరోహిత్యాన్ని సృష్టించి బ్రాహ్మణులుకాని
సాహిత్యం కవిత్వం

ఒక ప్రజాస్వామ్యంలో

కొన్ని మాటలకు నరం ఉండదు గురిపెట్టి వదిలాకచిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల విలవిలలాడుతూ ఉంటుంది  గుండె నిండా విషం నింపుకున్నప్రేమ ఒలకబోయడం నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు  ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలోఅజ్ఞాతం వీడిన నేల సంబరంనీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు  ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమోమొలకెత్తలేదు పన్నెండు వందల ప్రాణాలు పోసినిర్మించుకున్న కల  కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి ఈ రోజులు పరిమళించకపోవచ్చుఈ కాలం వేదనై మిగలవచ్చుఈ ఉదయం నిరాశై వెలగవొచ్చుఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు ఒకరోజునుమండే నెత్తురు పరిమళిస్తుందిఒక కాలాన్నిఆనందంగాపొలం నుండి రైతులు భుజం మీద మోసుకు వస్తారుప్రజలు ఒక ఉదయంఊహ కందని ఆశలు ఉదయిస్తారు  ఒక ఆకుపచ్చని సందేశమైతెలంగాణ దుఃఖ భూమిని