వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ