వ్యాసాలు

సంఘటితం అవుతున్న బస్తర్ ఆదివాసీ పోరాటాలు

“గత సంవత్సరం, కొంతమంది జిల్లా రిజర్వ్ గార్డులు గ్రామానికి వచ్చి నన్ను పట్టుకుని, నక్సలైట్లు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని వేధించడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు అడవిలో తిప్పారు. చాలాసార్లు శారీరకంగా హింసించి, చివరకు అడవిలో వదిలేశారు, ”అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాల ఆరోపణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్మిత (పేరు మార్చబడింది) అన్నారు. గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న భద్రతా బలగాల శిబిరాలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనలు చేస్తున్న వేలాది మంది గ్రామస్తుల్లో స్మిత ఒకరు. స్మిత గ్రామంలో మాదిరిగానే, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, తదితర జిల్లాల్లోని గ్రామాల్లో భద్రతా దళాల