సాహిత్యం

అలిశెట్టి  జీవన దృశ్యం

ఏయే విలువల ఆధారంగా ఒక కవిని అంచనా వేయాలన్న ప్రశ్నలు విమర్శకులకు ఎదురవుతాయి. మానవ విలువలకు ప్రతినిధిగా చూడాలా? సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తిగా చూడాలా? వంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ‘‘మానవ  విలువలు’’, ‘‘ఉద్యమం’’ వేర్వేరే కావు. అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో గొప్ప కవితలెన్ని రాసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘‘ఏకైక మహాకవి’’గా  శ్రీశ్రీ గారు గుర్తింపు పొందారు. వివాద రహితమైన అరుదైన కవుల్లో ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ స్థానం సమున్నతమైంది. అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరంలో నిష్కలమైన నిజాయితీ కనిపిస్తుంది. ‘‘బీదరికం  అనారోగ్యం ఒక గొప్ప కవిని మనకు కాకుండా చేశాయి’’. ‘‘ఓడ్‌  టు పోయెట్స్‌’’