కవి నడిచిన దారి

నా దారి పూల బాట కాదు

అసలు ఈ నడక ఎక్కడ మొదలైంది.? ఎప్పుడు మొదలైంది..? దారి ఎక్కడ మారింది...? పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను పదోతరగతి వరకు అక్కడే పెరిగాను. స్నేహితులు, బంధువులు అంతా ఆధిపత్య కులాల వాళ్ళే, నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదే వాతావరణంలో ఉంచింది. ఆ వయసులో ఆ ఆధిపత్య ప్రవర్తన తప్పుగా కానీ లేదా అన్యాయంగా ఎప్పుడూ అనిపించలేదు. పదోతరగతి తరవాత మొదటిసారి డిప్లొమా చదవడానికి ఊరు నుండి బయటకు వచ్చాను, అక్కడ కూడా కులం నన్ను కలుపుకుని పోయింది. అక్కడ కూడా నా చుట్టూ అదే మనుషులు చేరారు. నాలో ఉన్న