సంభాషణ

నిమ్మలపాడు దీర్ఘకాలిక పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు. సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని,  ప్రభుత్వం