కవిత్వం

బగీచాలో పాట

ఆ పక్షి కావేరీ పుట్టిన దేశంలో రెక్కలొచ్చి జెంషడ్‌పూర్‌ జెసూట్‌ చర్చినావరించిన ఆడవిలోకెగిరిపోయింది జీసస్‌ను సిలువ వేసిన దారుల్లో దేశ దేశాల్లోనూ తిరిగింది సేవా త్యాగం నేర్చుకున్నది చైతన్యంగా మార్చుకున్నది పాడిరది.. జీవకారుణ్యం రాజ్య ధిక్కారం దాకా పోరాటమేనన్నది గాయాలకు నిట్టూర్పు మందు కాదు నిష్కృతి మందుకు అన్వేషించింది విముక్తి తత్వాన్ని గానం చేస్తూ కావేరీ ప్రవహించే దేశానికొచ్చింది పాటేనా ఎంచుకోవాల్సిన బాటకూడ ఉండాలని బాల్యంలో మనసులో ప్రవేశించిన సెలయేళ్లు ప్రవహించే దేశానికొచ్చింది హో అంటే హో అని వాళ్ల భాషలో సంభాషించింది వాళ్ల బాధల్ని పోరాటాల్ని ప్రతిఫలించింది చెట్లు నదులు అడవులు నేల విధ్వంసమయ్యే విశ్వ విపత్తు