సంభాషణ

ఇద్దరు మిత్రులు – విప్లవోద్యమంలో రెండు స్రవంతులు

కత్తి మోహన్‌ రావు స్మృతిలో ఎంఎస్‌సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్‌ఎస్‌యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు - కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్‌ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్‌ జైలు నుంచి బెయిల్‌ మీద