సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
సంపాదకీయం

ఎన్నికలు – మరోసారి అర్బన్ నక్సల్స్, ముస్లింలే టార్గెట్

అర్బన్ నక్సల్ అంటే ఎవరు? అటువంటి వారున్నారా ? భారత ప్రభుత్వపు పార్లమెంట్ రికార్డ్ ల ప్రకారం అయితే లేరు. ఈ సంగ‌తి   కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి మాత్రం ప్రతి సభలో, సమావేశంలో అర్బన్ నక్సల్స్ గుర్తుకువస్తారు. ఈ నెల 23 న గుజరాత్ లో పర్యావరణం పై రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  దేశప్రగతిని అర్బన్ నక్సలైట్లు  అడ్డుకుంటున్నారని  మోదీ అన్నాడు. దేశంలో 6000కు పైగా అప్లికేషన్ లు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయని తెగ బాధ‌పడ్డాడు.  వీటివల్ల పెట్టుబడి
సంపాదకీయం

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది.  ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో  దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు.  దాడులుకు గురి అయింది ముస్లింలు,  చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడుల‌కు వున్న రాజ‌కీయ ప్రాధాన్య‌త
సంపాదకీయం

రైతులకు విజ‌యంః మ‌రి ఆదివాసుల‌కు ఎప్పుడు?

నవంబర్ 19, 2021 దేశ చరిత్రలో ఫాసిస్టు శక్తులకు ఓటమి ఎదురైన రోజు. మూడు  వ్య‌వ‌సాయ  చట్టాల రద్దుపై మొండిగా ఉన్న  కేంద్ర  ప్ర‌భుత్వం  లొంగిరాక త‌ప్ప‌లేదు.  దేశంలో గత ఏడాది కాలంగా సాగుతున్న రైతాంగ పోరాటం విజయం సాధించింది. ఈ విజయం కార్పొరేట్ ప్రాయోజిత పాలక వర్గాలు పైన విజయం. సుదీర్ఘ కాలంగా కొనసాగించిన పోరాటం ప్రజలకు అనేక అనుభవాలను ఇచ్చింది.  పాలక వర్గాలు పోరాడుతున్న ప్రజలను ఖలిస్తానీలుగా, అర్బన్ మావోయిస్టులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేశాయి. ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. వీటన్నిటిని తట్టుకుని రైతులు విజయం సాధించారు. ఈ కాలంలో 700 మంది రైతులు
సంపాదకీయం

మ‌న జీవితాల్లోకి చొర‌బాటు

అత్యంత శక్తివంతుడ‌ని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో,  కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు.  కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయ‌న అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భ‌యపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగ‌ల‌వాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే  కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత
సంభాషణ

బోనులో న్యాయ వ్య‌వ‌స్థ‌

స్టాన్ స్వామి హత్య చేయబడ్డాడు. హత్య చేసింది భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఇవ్వని కలిసి చేసిన హత్య ఇది. క్రూరమైన ఊపా చట్టాన్ని  ఆమోదించిన భారత  పార్లమెంటు దీనికి సాక్ష్యం. న్యాయాన్యాయాలు తేల్చే న్యాయవ్యవస్థ ఈ రోజు బోనులో నిలబడిడింది. న్యాయ వ్యవస్థ పైన, నల్ల చట్టాల పైన చర్చ జరగాల్సిన ఒక సందర్భం ముందుకు వచ్చింది. సమాజ పరిణామక్రమం ముందుకు వెళ్లే కొద్దీ ఆధునికంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పాత, మధ్య యుగాల స్వ‌భావంతో  పనిచేస్తున్నాయి.ప్రొ.సాయిబాబు కేసు మొదలు నేడు రైతాంగ ఉద్యమాల్లో, సీఏఏ ఆందోళనకారుల అరెస్టుల వరకు కోర్టులవ్యవహరిస్తున్న తీరు అందుకు
సంపాదకీయం

మ‌న హృద‌యం, ఆలోచ‌న‌లు, చేతులూ పాల‌స్తీనా కోస‌మే

70 ఏళ్లుగా ఆ నేల  పాలస్తీనా ప్రజల రక్తంతో త‌డుస్తోంది. వాళ్ల తమ జాతి విముక్తి  ఆకాంక్ష ప్ర‌పంచ‌మంతా పిక్క‌టిల్లుతోంది. ఆ ప‌క్క‌నే ఇజ్రాయిల్ దారుణాలు వినిస్తున్నాయి.  అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఈ మే 14తో దాని దురాక్రమణకు 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు అది పాలస్తీనా ప్రజల అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ సారి దానికి మే 7 ను ఎంచుకుంది. జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా
వ్యాసాలు

క‌రోనా కాలంలో పోలీసు కాల్పులు

స‌కెండ్ వేవ్ లోనూ క్యాంపుల ఏర్పాటు, ఎన్‌కౌంట‌ర్లు,  స్తూపాల కూల్చివేత  ప్రపంచమంతా  కరోనాతో యుద్ధం చేస్తున్న కాలం ఇది. మనిషి తనకు తాను బందీగా మారుతున్న కాలం. బతకాలంటే బందీగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయలేక అంతా మనుషులు మీద నెట్టేసి ఊరుకున్నాయి. ప్రాణ అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ కూడా అందివ్వ‌కుండా ప్ర‌జ‌ల  నిర్లక్ష్యం కారణంగానే కరోనా  ఉధృత‌మైందని  అంతా ప్రజల మీదికే తోసేశాయి.. ఈ విష‌యంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలు పోరాట ప్రజలపై  అణిచివేత‌కు త‌న ర‌హ‌స్య హ‌స్తాల‌ను కూడా ఎప్ప‌టి కంటే దుర్మార్గంగా వాడుతున్నాయి. ముఖ్యంగా స‌క‌ల ప్రాకృతిక సంప‌ద‌ల‌ నిలయమైన దండకారణ్యంలో పాల‌క దాడులు  నానాటికి
సంపాదకీయం

ల‌క్ష ద్వీప్ కోసం మాట్లాడ‌దాం

లక్ష ద్వీప్ మనకు పడమట దిక్కున ఉన్న దీవులు. ముప్పై ఆరు దీవుల సమూహం. డెబ్భై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం. 97 శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. మిగతా మూడు శాతం బయటి నుండి వచ్చిన వారు. అక్కడ గత కొన్ని వారాలుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కారణం తమ నేల నుండి తమని పరాయి వారిని చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతలకు ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులను పరిపాలన అధికారులుగా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ గత డిసెంబర్లో గుజరాత్ కు చెందిన భాజపా నేత ప్రఫుల్ ఖోడా
సంపాదకీయం

ఈ నిషేధాన్ని అంగీక‌రిద్దామా?

విర‌సం మ‌రోసారి నిషేధానికి గురైంది. తెలంగాణలో విర‌సం  సహా పదహారు ప్రజాసంఘాలను నిషేధించారు. మార్చి 30 న త‌యారు చేసిన జీవో నెంబర్ 73లో  పదహారు  ప్ర‌జా సంఘాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల‌ని  పేర్కొన్నారు.  ఇవి  మావోయిస్టు పార్టీ వ్యూహం ఎత్తుగడల ప్రకారం పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. తెలంగాణ డిజిపి చీఫ్ సెక్రటరీకి 12 మార్చి 2021 న ఒక లెటర్ పంపారు. దానికి ప్రతిగా మార్చి 30న తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరుతో ఈ జోవో విడుదల అయింది. అయితే అది ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ 23 న పత్రికలకు చేరవేశారు. మామూలుగా