వ్యాసాలు

చదువులు ఎలా ఉండాలి? చదువుల సారం ఏమిటి?

(త్వరలో విడుదల కానున్న కొకు నవల చదువు పునర్ముద్రణకు రాసిన ముందుమాట) కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన నవలలో ఒక పెద్ద నవల చదువు. ఇది 1950లో మొదటిసారిగా అచ్చు అయింది. అప్పటి నుండి ఇది అనేక పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సహజంగానే చదువు అనే టైటిల్‌ ఆ నవలకు ఉండడంతో ఇది ఆనాటి విద్యా విధానానికి సంబంధించిన నవల అని చాలా మంది అనుకోవడం కద్దు. కానీ ఇది చదువులకు మాత్రమే పరిమితమైన నవల కాదు. 1915 నుంచి 1935 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలపు ఆంధ్రదేశ సాంఘిక చరిత్ర చిత్రణ ఈ నవలలో
సంపాదకీయం

విశ్వవిద్యాలయాలా ? శిశు మందిరాలా ?

కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ` 2020లో భాగంగా ఐకెయస్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఇప్పుడు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యిమంది అధ్యాపకులకు భారతీయ జ్ఞాన వ్యవస్థలలో డిగ్రీస్థాయిలో బోధించడానికి అనుగుణంగా సుశిక్షితులను చేసే కార్యక్రమాన్ని యుజిసి ప్రారంభించింది. గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలపై ఒక అవగాహన కల్పించడం దీని వుద్దేశం. అలాంటి పాఠాలను బోధించడానికి వీలుగా అధ్యాపకులకు శిక్షణ యిస్తున్నారు. యుజి స్థాయిలోనూ, పిజి స్థాయిలోనూ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా దీనికి సంబంధించిన రెండు కోర్సులను పూర్తిచేయాలనే నిబంధనను యుజిసి
వ్యాసాలు

నిజం చెప్పడం నేరమా?

కేరళ పౌరహక్కుల కార్యకర్త అయినూరు వాసుకు జైలు నిర్బంధం కేరళకు చెందిన అయినూరు వాసు పౌరహక్కుల కార్యకర్త. వయసు 94సంవత్సరాలు. ఆయన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజికోడ్‌ న్యాయస్థానం ఆయన్ను 14రోజుల పాటు జైలులో వుంచాలని ఆదేశించింది. ఈయన గ్రో వాసు అనే పేరుతో అందరికీ చిరపరిచితుడు. గ్రో అంటే గ్వాలియర్‌ రేయాన్స్‌ కార్మిక సంస్థ అని అర్థం. ఆ కార్మిక సంఘానికి ఆయన నాయకుడిగా వ్యవహరించేవాడు. తన రాజకీయ భావాల కారణంగా బెయిల్‌ వ్యవహారంలో న్యాయస్థానంతో సహకరించడానికి నిరాకరించాడన్న కారణంగా కామ్రేడ్‌ వాసును జైలుకు పంపారు. 2016 నవంబర్‌లో కొజికోడ్‌ వద్ద కామ్రేడ్‌ కుప్పు దేవరాజ్‌,
సంపాదకీయం

మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం
సంపాదకీయం

బీహార్ విప్ల‌వ సాహిత్యోద్యమ శిఖ‌రం

కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్‌ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు. 1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్‌ఆర్‌సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్‌ 14, 15 తేదీలలో ఏఐఎల్‌ఆర్‌సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్‌ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్‌ఆర్‌సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం