ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి