వ్యాసాలు

‘బస్తర్‌లో ఆదివాసీ మహిళలకు స్వేచ్ఛ లేదు’- సోనీ సోరీ

భారతదేశం మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో చాలా కాలంగా ఖనిజాల దోపిడీ విపరీతంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. పెట్టుబడిదారులకు ఈ దోపిడీని సుసాధ్యం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశమంతటికన్నా అత్యధిక సంఖ్యలో అర్ధ సైనిక బలగాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన ఈ సైనిక బలగాలు ప్రభుత్వ విధానం ప్రకారం ఆదివాసీల ధైర్యాన్ని దెబ్బతీయడానికి మహిళలపై లైంగిక దాడులు చేస్తాయి. బస్తర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా స్వయంగా శారీరక రాజ్య హింసను భరించింది. మహిళా దినోత్సవం
సంభాషణ

ఆయుధాల బలంపై అధికారాన్ని నిలుపుకోలేరు

ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం