కవిత్వం

‘గోడలకు నోళ్లున్నాయి’

(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. - వసంత మేఘం టీం ) మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్‌, యురోపియన్‌ యూనియనూ, జర్మనీ పేటెంట్‌ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి