ఆగస్టు 16 న, విప్లవ చిత్రకారుడు కామ్రేడ్ పార్ట్స్ బగానీని ఫిలిప్పీన్స్ సైన్యం, పోలీసులు దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్ పార్ట్స్ బగానీ న్యూ పీపుల్స్ ఆర్మీ (NPA) పోరాట యోధుడు. ఉద్యమంలో ప్రసిద్ధ కళాకారుడు, సామ్రాజ్యవాద, భూస్వామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫిలిప్పీన్స్ ప్రజల పోరాటానికి తన జీవితాన్ని, ప్రతిభను అంకితం చేశాడు. ప్రజల రోజువారీ జీవితం, పోరాటాల నుండి అతను స్ఫూర్తిని పొందాడు. ప్రజాదరణ పొందిన అతని కళాకృతులు విప్లవకర ప్రచురణలు, పుస్తకాలు, సాహిత్య రచనలను అలంకరించాయి, విశాల ప్రజానీకానికి స్ఫూర్తినిస్తూ పోరాట మార్గం వైపు ప్రోత్సహించాయి. ఫిలిప్పీన్స్ పాలకవర్గం ఆదేశాల మేరకు హత్యచేసి,