తపాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ?
చెడ్డ పోస్టుమ్యాన్ ఉండడు.. , మంచి పోలీస్ కనిపించడు.. అనేది ఓ నానుడి. అంటే.. పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత నిస్వా ర్థంగా త్యాగపూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియజేస్తున్నది. నేటికీ మారుమూల గ్రామం మొదలు నగరాలు, పట్టణాల దాకా త్యాగపూరితంగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగం ఏదైనా ఉన్నది అంటే అది తంతి తపాలా శాఖ (పోస్టల్ డిపార్ట్ మెంటు) మాత్రమేనని చెప్పుకోవాలి. వృత్తి నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ సమస్య ల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మె చేస్తే, వారిని కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వం