కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 3

అమెరికాలోని పూర్వపు స్పానిష్ సన్యాసులవంటి మత ప్రచారకులకు ఈ ఆచారాలు ‘పరమ అసహ్యం’గా కనిపించాయి. అందుచేత వాటిని తోసేశారు. అలా కాక వారు కొంచెం విమర్శనా ద్రుష్టితో పరిశీలించి ఉన్నట్లయితే, ఈ మాదిరి క్రైస్తవేతర కుటుంబ రూపానికి నిదర్సనలు ‘పోలినీషియా’ అంతటా కనబడి ఉండేవి. [అంటే, మనం అసహ్యించుకున్నా, ఇష్టం లేకపోయినా చరిత్రను కాదనలేం. అన్నది ఎంగెల్స్ అభిప్రాయం. ఈ అవశేషం మన భారతంలో కూడా వుంది కదా! ద్రౌపదికి అయిదుగురు భర్తలు అన్నదమ్ములే] గుంపు పెళ్లి ఉన్నంత వరకు సంతానాన్ని తల్లి వైపునుంచే పరిగణిస్తారు. అందుచేత ‘ఆడ పరంపర’ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అటవిక కాలం లోనూ,
కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం -2

కుటుంబంమోర్గాన్ ఈనాటి న్యూయార్కు లో నివసిస్తున్న ఇరాక్యూ ఇండియన్ల మధ్య తన జీవితంలో అధిక భాగాన్ని గడిపాడు. వారి తెగలలో ‘సెనేకా’ అనే తెగకు దత్తు పోయాడు కూడా. వారిలో ఒకవిధమైన దంపతీ వివాహ పద్దతి [ఒకభర్తా, ఒకభార్య] అమలులో వుంది. అయితే, ఈ బంధాన్ని సులువుగా తెంచేసుకోవచ్చు. దానికి ఆయన ‘జంట కుటుంబం’ అని పేరు పెట్టాడు.[జంట కుటుంబం అనేదానికి వేరే అర్ధం కూడా వుంది. అది తర్వాత చూస్తాం] వారికి కలిగిన సంతానం ఏ జంట తాలూకా పిల్లలో అందరికీ తెలుస్తుంది. అలాగే గుర్తిస్తారు కూడా. తల్లీ, తండ్రీ, కొడుకూ, కూతురూ, తోబుట్టువూ, తోడ బుట్టిన
క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం

(మార్క్సిస్టు సిద్ధాంత ర‌చ‌న‌ల్లో ఏంగెల్స్ రాసిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ‌యంత్ర ఆవిర్భావం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా తొలి రోజుల్లోనే ఈ పుస్త‌కం తెలుగులోకి వ‌చ్చింది. అనేక ప్ర‌చుర‌ణ‌లుగా వెలుబ‌డింది. వి. వెంక‌ట‌రావు వ‌సంత‌మేఘం కోసం దీన్ని స‌ర‌ళంగా ప‌రిచ‌యం చేస్తున్నారు.  ఈ సీరియ‌ల్   ఈ సంచిక‌తో ఆరంభ‌వుతున్న‌ది. వీలైతే ఇలా కొన్ని మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాల‌ను ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాం- వ‌సంత‌మేఘం టీ)  ●  ఈనాడు   అమలులో వున్నకుటుంబ వ్యవస్థ గతంలో ఎలా ఉండేది? ఎప్పుడూ ఇలాగే ఉండేదా?మన సాంప్రదాయ వాదులు వాదిస్తున్నట్లు ఇది భారతదేశానికి మాత్రమే సొంతమా? బయట ప్రపంచంలో ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎలా