తొలికెరటం

అందరు చదవాల్సిన కథలు

కలవపూడి కథలు రచయిత సాoబశివతడవర్తి గారు రాసిన మొదటి కథ సంపుటి. ఉభయకుశలోపరి అని ఒక పిల్లవాడి ఉత్తరం తో మొదలై హంస మేడ అనె కథ లో..ఒక యువకుడి విరహ ప్రేమ లేఖలకు తన ప్రేయసి ప్రత్యుత్తరం తో ఈ కథ సంపుటి ముగిసిద్ది. ఈ కథ సంపుటి లో కృష్ణప్ప, కటారి, తారకం అనే పాత్రలతో వాటితో పాటు మధ్యలో వివిధ కథల్లో ఆ పాత్రధారులు  మనల్ని పలకరించి వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, కథలు , స్మృతులు అన్ని మనతో పంచుకుంటూ వెళ్తారు. ఆ కథలతో పాటు మనమూ కలవపూడి కెళ్తామూ. మొదటి కథ నుండి
తొలికెరటం

సామాజిక స్పృహ కలిగించే ఖయ్యుం కొడుకు

చాలా సులభమైన విధంగా చాలా అర్థవంతంగా ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి.  ప్రతి కథ తాత్వికచింతనతో కూడుకున్నది. ప్రతి  కథలో రాజకీయాలు ఉంటాయి.  మత రాజకీయం, ఎన్నికల రాజకీయం, కుల రాజకీయం, ప్రేమ రాజకీయం, సాహిత్య రాజకీయం, అనేక కోణాలలో అన్ని రకాల రాజకీయాలు మనకు  ఈ కథలో కనిపిస్తాయి.  దేశంలో రాజకీయం ఏ వైపుగా సాగుతుందో ఆ రాజకీయం వల్ల జరిగే అనర్ధం ఎంతగా జరుగుతుందో ఫాసిజాన్ని ఎంత వేగంగా విస్తరింపజేస్తున్నారో నియంత ప్రజల ఆలోచనలను ఏ వైపుగా డైవర్ట్ చేస్తున్నారో, ఎన్నికలలో గెలుపు ఓటముల మధ్య జరిగే విధానం కూడా EVM ను, అక్కడున్న
తొలికెరటం

స్వేచ్ఛ కోసం విరబూసిన ఎర్రమల్లెలు

ఎర్ర మల్లెలు, వాక్యం పాతదైనప్పటికి యి పుస్తక ముఖచిత్రం మాత్రం ఆకర్షించే విధంగా చదవాలని ఆత్రుత పెంచే విధంగా, ముఖ్యంగా యీ కాలపు జనరేషన్ ను  ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ముందుగా యి పుస్తకం నవలగా మారిందా అనే సందేహం చదివింతరువాత  కలిగింది నాకు. సరే అది చివరకు మాట్లాడుకుందాం. కథలో ప్రధాన పాత్రలు మూడు. వారి చుట్టూతా తిరుగుతుంటుంది కథ. అయితే కథ వస్తువు కొత్తదేమీ కాదు. అయినప్పటికీ ఆ కథని చెప్పే విధానంలో రచయిత్రి గారికి మార్కులు వేయొచ్చు. నేనేమీ మాష్టారు కాదు, ఆవిడ రాసింది పరీక్షా కాదు, కానీ తిన్న తిండి మీద
తొలికెరటం

ఉచ్చ నీతికి చెంప పెట్టు ‘ఉచ్చల జలధి తరంగ’

 “కవితలు చెప్పుకునే వేళ కాదిది, కాళ్లు కడుక్కునే వేళ కూడా కాదు, ఇది ఒక శిశ్నచ్చేద సమయం “ నిజమే ఇది ఒక  విపత్కర  కాలం మొన్నటి వరకు వాడి గురి అంతా అడవుల మీదే అనుకున్నాం. అడవుల్ని నాశనం చేసీ అక్కడి సహజ వనరుల్ని మొత్తంగా పెట్టుబడి వర్గాలకు అందించడమే వాళ్ళ లక్ష్యమన్న భ్రమల్లో ఉన్నాము. మనిషీ తత్త్వాన్ని వేర్లతో సహా పెకిలించాలనే ఉద్ధేశంతో ఇక్కడి మనుష్యుల్ని కులాలుగా,మతాలుగా, జాతిగా, ప్రాంతంగా ఎన్ని రకాలుగా విడగొట్టుకుంటూపోవాలో అన్ని రకాలుగా విభజిస్తూ వస్తున్నారు. అలా విభజించడానికి  విద్వేషాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు.వెళ్ళే దారిలో కనిపించేవన్ని వాళ్ళు పంచే విద్వేషానికి మాధ్యమాలుగా
తొలికెరటం

విప్లవోద్యమంలాగే  మేరువు సావిత్రమ్మ  జీవితం

అనాదిగా భారతీయ సమాజం అనేక రకాల ఆధిపత్యాలను, అసమానతలను తనలో నింపుకుని కాలంతో పాటు ప్రయాణం చేస్తుంది. ఇట్లాంటి అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేఖంగా పీడిత సమూహాల పోరాట పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సాగుతున్న ఈ పోరాటాలలో ఎంతో మంది మనుషులు కుల, వర్గ, జాతి, లింగ భేదం లేకుండా తమ జీవితాలను త్యాగమయ జీవితాలుగా మార్చుకున్నారు. ఏ అసమానతలు లేని సమాజం కోసం తమ ప్రాణాలను సైతం యుద్ధంలో ఉంచారు. అట్లాంటి మార్పుకోసం జరిగే యుద్ధంలో పాల్గొన్న మనుషులు కూడా అనేక సార్లు సమాజం విధించిన అణచివేతల భావజాలం నుండి తప్పించులేకపోయారు.
తొలికెరటం

మనుషులుగా ఉండమని చెప్పే కథలు

మొదటగా ఇది నాకు చాలా ఇష్టమైన కథల పుస్తకం. ఈ "టోపి జబ్బర్" పుస్తకంలో 11 కథలు ఉన్నాయి. ఒక కథ ద్వారా ఒక్క విషయం మాత్రమే చర్చించాలని రచయిత వేంపల్లె షరీఫ్ గారు అనుకోలేదు. ఒక ముస్లిం మనిషి చుట్టూ ఉన్న కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షత ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో నాలుగు కథలు మినహా కథల్లో తన రచనా శైలితో పరిచయం చేశారు. ముస్లింల ఉనికి ఏ స్థితిగతుల్లో ఉందో ఈ కథల ద్వారా చెప్పారు. వాళ్ళ మతంలో వున్న ఆచారాలు, సంప్రదాయాలు. ఇంకా ఏ విధంగా వాళ్ళు సమాజంలో అవమాన పడుతున్నారో
తొలికెరటం

కళ్లకు చెమటలు పట్టించిన నల్ల బంగారం కథలు

బొగ్గుబావిలో పని కోసం సొంత ఊరిని వదిలేసి వచ్చిన కుటుంబం. తట్ట, చెమ్మసు తీసుకుని సైకిల్ పైన పనికివెళ్ళే తండ్రి. భర్త కష్టానికి తన కష్టాన్ని జతచేస్తూ, భర్త రావడం కాస్త ఆలస్యమైనా తన భయాన్ని ఇంటి దర్వాజ అలికిడిలో వ్యక్తీకరించే తల్లి. తమని ఎంతో ప్రేమించే తండ్రి కోసం, తండ్రి ప్రేమగా తీసుకొచ్చే వస్తువు కోసం కిటికీ చువ్వల నుండి ఎదురుచూపులనే ఎర్రతివాచిలుగా పరిచి పెట్టే కూతుర్లు. ఇది నల్ల బంగారం కథలలో రచయిత బాల్యం. కథలన్నీ చదువుతుంటే చాలా దగ్గరి అనుభవాలు గుర్తుకొచ్చాయి.  ఆలోచిస్తే ఇది అచ్చంగా నా బాల్యం. సింగరేణి ప్రాంతంలో గడిచిన నా
తొలికెరటం

ఆమె జస్ట్ హౌజ్ వైఫ్ ?

కవితే...కవిత్వమై పుస్తకమంతా పరిమళించారు, పరిణమించారు. స్పందించే హృదయాల్ని సంకెళ్లతోనే కాదు, కవిత్వాలతో కూడా బంధించగలరని ఈ పుస్తకాన్ని చదివాకే అర్ధమైంది. సమస్త గాయాలకి లేపనంగా లోపలెక్కడో చివురంత ప్రేమ తనమీద తనకే కాదు, తన అక్షరాలపై మనకీ ప్రేమని పుట్టిస్తాయి. కలవరపెడుతూనే, కలబడేలాచేస్తాయి. కవిత కుందుర్తి గారు కేవలం తనకోసమే కాదు, "జస్ట్ ఎ హౌజ్ వైఫ్" అని అనిపించుకుంటున్న ఆడవాళ్లనీ, ఉద్యోగాలు చేస్తూ కూడా తగినంత గౌరవం, స్వాతంత్రం లేని ఆడపిల్లలందరిని తనలో కలుపుకొని జస్ట్ ఎ హౌజ్ వైఫ్ అనే  కవిత్వ సంపుటిని ప్రచురించారు .   తనని తానే ఒత్తిగిల్లుకొని మెరిసే నక్షత్రమవుతారు. ఒంటరితనం మనిషిది
తొలికెరటం

స్త్రీల చుట్టూ ఉన్న హింసను చూపే “చిక్ లిట్” 

పిల్లలు పుట్టగానే జెండర్ తో సంబంధం లేకుండా వాళ్ళకు కొన్ని మూసపద్దతులను, కొన్ని తయారుచేయబడిన ప్రవర్తనలను, భావోద్వేగాలను (Manufactured Behaviours and Feelings)  సమాజం, కుటుంబం, తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా వాళ్ళ చుట్టూ జనాలు నూరిపోస్తుంటారు. కాస్తా కూస్తో మినహాయింపులు ఇచ్చినట్టే ఇచ్చి కచ్చితంగా వాటిని పాటించాలని నియమం పెట్టకనే పెడ్తారు. పిల్లలకు ఇలాంటి కుట్ర ఒకటి జరుగుతుందని తెలియనివ్వరు. పొరపాటున ఇచ్చిన మినహాయింపులు దాటి ప్రవర్తిస్తే అది చాలా పెద్ద నేరంగా, బరితెగింపుగా, కొన్నిసార్లు కొన్ని వర్గాలు  ధైర్యంగా కూడా గుర్తిస్తారు. అయితే కొన్ని సమూహాలు స్వచ్ఛందంగానే పై పద్దతులను పాటించాలనే ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛనిస్తారు
తొలికెరటం

భూమి పతనంలోని సామాజిక విషాదం

సాహితీలోకంలోకి ముందుగా చాలా మంది కవితల్తోనో, కథల్తోనో ఎక్కవగా ప్రవేశిస్తుంటారు. కాని గూండ్ల వెంకట నారాయణ  మొదటగా నవల ప్రక్రియ ద్వారా అది కూడా డిగ్రీ చదివే వయస్సులో సాహితీలోకానికి  ‘భూమి పతనం’ అనే నవల ద్వారా పరిచయం కావడం చాలా విశేషమైన విషయం. గూండ్ల వెంకట నారాయణ  తాను వ్యక్తికరించబోయే విషయాలకు తగిన ప్రక్రియగా నవల ఉండటం వల్ల నవల ప్రక్రియను వాహకంగా ఎన్నుకున్నారేమోనని భూమి పతనం నవలను చదివిన తర్వాత అనిపించింది. భూమి పతనం తర్వాత ఇయ్యాల ఊళ్ళో, గరికపాటోడి కథలు, కాపలాదారుని పాటలు, ద్రావిడమహాసముద్రం వంటి రచనలు చేసారు. ‘భూమి పతనం’ పుస్తకం కవర్