వ్యాసాలు

యుద్ధం మధ్య మనం…,

... కానీ మనకు ఆ సంగతి తెలియదు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఫాసిస్టు కాలంలో జరుగుతున్న యుద్ధం ఇది. జర్మనీలో  గ్యాస్‌ ఛాంబర్స్‌ గురించి విన్నాం. ఇటలీలో బ్లాక్‌ షర్ట్స్‌ గురించి విన్నాం. జనంలోంచే ఉన్మాద మూకను కూడగట్టి సమాజం మీదికి ఎగదోసిన చరిత్ర చూశాం.  ఇక్కడ  జనం మీదికి సైన్యాన్ని ఉసిగొల్పి, వైమానిక దాడులు చేస్తున్న ఫాసిస్టు యుద్ధం మధ్యలో మనం జీవిస్తున్నాం. జనవరి 11న తెల్లవారుజామున దండకారణ్యంలోని దక్షిణ బస్తర్‌ పామేడ్‌`కిష్టారం ప్రాంతంలో  భారత ప్రభుత్వం హెలికాప్టర్‌తో బాంబు దాడులు చేసింది. దేశాల మధ్య  సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ చాపర్‌ను