మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని