అనేక అస్థిత్వాల కలనేత యాలై పూడ్చింది
కవిత్వం గురించి మాట్లాడుతున్నాప్పుడు ఇటివల చదివిన కవితా సంపుటులు జ్నాపకమౌతున్నాయి.అజంతా స్వప్న లిపి .పల్లె పట్టు నాగరాజు యాలై పూడ్చింది. .జీవిత కాలమంతా నలభై కవితలను రాసి కవిత్వ స్వప్నలిపిని వదిలివెళ్లిన అజంతా ,వర్తమాన కాలంలో నిలబడి కవితా రచనలో వున్న పల్లి పట్టు నాగరాజు. అసలు వీరిద్దరి భాధ ఏమిటి?. వీరి మధ్య సారూప్యత ఏమిటి? అజంతా కవితా రచన స్థల ,కాలాలు వేరు .నాగరాజు కవిగా కొనసాగుతున్న కాల సoధర్భం వేరు. కవి వీరిద్దరి ప్రపంచం, దాని మనుగడ ఒకే స్తితిలో ఉన్నాయా? అజంతా కవిత్వంలో అంతర్ముఖీనత ఉండవచ్చు. ఆ లోపలి చూపు సామాజిక శకల౦తో ముడి



