ఇది, 'ఒక పక్షి కత'. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది. ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.'ఔచ్..'మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ