సంస్మరణ

కాకలు తీరిన యోధుడు సృజన్ సింగ్

భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది. గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980,