దండకారణ్య సమయం

బస్తర్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక చర్యలో చనిపోయినవారిలో సాధారణ గ్రామస్థులు

భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో  బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో కనీసం ఇద్దరు ఆదివాసీ గ్రామస్థులు, వారిలో ఒకరు చెవిటి బాలిక. ఈ కథనంలో లైంగిక హింస, పోలీసు క్రూరత్వం, ఇతర రకాల హింసల ప్రస్తావనలు ఉన్నాయి కమ్లీ కుంజమ్‌కి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, కడుపునొప్పి, సరిగ్గా తినలేకపోతోంది. 2024 ఏప్రిల్ 2, ఉదయం 9 గంటలకు, ఆమె నేంద్ర గ్రామంలోని తన మట్టి ఇంటి వరండాలో పడుకుని, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు  పోలీసులు ఇంట్లోకి రావడంతో భయపడి లోపలికి