కొలంబస్కు వ్యతిరేకంగా
కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి లోకం గొంతెత్తింది
వియత్నామ్ సంఫీుభావాన్ని తలపిస్తూ
అమెరికా విశ్వవిద్యాలయాల్లో
పాలస్తీనియన్ల సంఫీుభావ పోరాటం
... ... ...
అధ్యాపకుడు కులపతి అయితే
పాఠాలు చర్చించడు పాలకుడవుతాడు
విద్యార్థులతో కలసినడువడు
పోలీసులను పిలుస్తాడు
లాఠీ చెప్పే పాఠం ఎప్పుడూ అగ్ని పర్వతం నుంచి
లావాను నిద్రలేపుతుంది
తూటా చెప్పే పాఠం ఎప్పుడూ
తుఫానయి ఎగుస్తుంది
... ... ...
కొలంబస్ వారసులయిన విద్యార్థులే
ఆక్రమణ సిలబస్ను ప్రశ్నించారు
పోరాట స్వరానికి అండగా నిలిచారు
నలుపు పసుపు తెలుపు
అన్ని రంగులూ క్యాంపస్లలో
సంఫీుభావ రంగులై జ్వలించాయి
... ... ...
ఇజ్రాయిల్ ఆక్రమణ యుద్ధానికి
అమెరికా ఆయుధాలు సరఫరా చేయొచ్చుకానీ
గాజాలో శాంతి కోసం
క్యాంపస్ను చేతుల్లోకి తీసుకోవద్దంటుంది
విద్యార్థులను అధ్యాపకులను
డెమోక్రటిక్ ప్రభుత్వం
... ... ...

చదువంటే పోరాటమనే రాడికల్ రోజులు గుర్తుకొస్తున్నాయి
చదువంటే ఆజాదీ అనే
జెఎన్యు పునశ్చరణ పులకింతవుతున్నది
... ... ...
సైన్స్ పో ఇన్స్టిట్యూట్ సారోబాన్ యూనివర్సిటీలో
ఇజ్రాయిల్ దురాక్రమణను ఖండిరచాలని
ఫ్రాన్స్లోను ప్రతిధ్వనించాయి
గాజా సంఫీుభావ గళాలు
క్యాంపస్ను స్వాధీనం చేసుకున్నాయి
ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం
మళ్లీ రెక్కవిప్పిన రెవెల్యూషన్ అవుతుందా


... ... ...
మళ్లీ గత శతాబ్ది అరవైలను
ఆవాహన చేసుకుంటామా
లెనిన్ శత వర్ధంతి సంవత్సరం కూడ
లెనిన్ నేడు లేడూ
చూడు జనంలో ఉన్నాడు
అని ఉద్యమిస్తామా
... ... ...
కలకత్తా నుంచి ఉస్మానియా దాకా
అప్నాబరీ నక్సల్బరీ అప్నా నామ్ వియత్నామ్ అన్నట్లే
ఆపరేషన్ కగార్కు ప్రతిఘటనగా
ఆక్రమిత గాజాకు అండగా
ఆదివాసులము, పాలస్తీనియన్లమూ అవుదమా

17 -4 - 2024

One thought on “ఆక్రమణ సిలబస్‌ను రద్దు చేద్దాం

Leave a Reply