Month: June 2023
బెల్లంపల్లి నుంచి దండకారణ్యం వరకు: కామ్రేడ్ ఆనంద్ ఐదు దశాబ్దాల విప్లవ జీవితం
“నిరంకుశుడు మరణిస్తే అతని పాలన అంతమౌతుంది; అమరుడు మరణిస్తే అతని పాలన ప్రారంభమవుతుంది” అనే 19వ శతాబ్దపు డానిష్ తత్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ ఉల్లేఖనం, మేం చదువుకునే రోజుల్లో గోడలపై రాసే మా అభిమాన నినాదాలలో ఒకటి. కామ్రేడ్ ఆనంద్ ఇక లేడు. కానీ అతని ఆలోచన, ఆదర్శం, త్యాగస్ఫూర్తి, అలుపెరగని విప్లవోత్సాహం, నిర్విరామ విప్లవ సాధన తరతరాలకు స్ఫూర్తినిస్తాయి.సీపీఐ (మావోయిస్ట్) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ 2023 మే 31 న దండకారణ్య దట్టమైన అడవిలో గుండెపోటుతో కన్నుమూశాడు. దండకారణ్య ప్రజల మధ్యన పార్టీ సీనియర్ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)
భారత విప్లవోద్యమ దశలన్నీ ఆయన జీవితంలో…
మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లలో కొందరిని మర్చిపోవచ్చు. ఇతరులను ప్రభావితం చేయగల వాళ్లను అంత సులభంగా మర్చిపోలేం. మన ఆలోచనలనో, లోకాన్ని పరిశీలించే చూపునో, జీవించే పద్ధతినో వాళ్లు ముట్టుకొని ఉంటారు. ఈ అంశకు కాలంతోపాటు ఎదిగే స్వభావం ఉంటే.. వాళ్లు మన జ్ఞాపకాలను, ఉద్వేగాలను, అనుబంధాలను దాటి చరిత్ర పరిధిలోకి వెళతారు. అంటే ఆలోచనలను ప్రభావితం చేసే దశ నుంచి భౌతిక పరిస్థితులను మార్చే క్రమంలో కూడా వాళ్లు భాగం అవుతారు. చరిత్రను నిర్మించే పని మొదలు పెడతారు. ఈ సమాజం అందించే ఏ ప్రత్యేకతలు లేని మామూలు మనుషులు ఈ పనిలో భాగమైతే ఎంత
మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం
హుస్సేన్ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “'తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ 'అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్ విప్లవోద్యమలో వచ్చిన సాహిత్యాగానికి ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక
చరిత్ర పుటల్లోకి ..పోరాట దారి మలుపే ‘తిరుగబడు’ కవిత్వం
'తిరుగబడు' కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. " ఇలా వచ్చి అలా వెళ్లిన 'తిరుగబడు కవులు...' " శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది. దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది. దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను పదునైన మాటల్లో వర్ణించారు. కాని
ఆనంద్ దూలా నూతన మానవుడు
ఇంద్రవెల్లి పాలవెల్లిఅమ్మ ఒడి ఇంకెంత మాత్రం అశ్రు సిక్తం కావొద్దనిఅందిస్తున్న ఆయుధాల్లోఅదిలాబాద్ నా తల్లి – (లాల్ బనో.... ఎన్ కె) అదిలాబాదు జిల్లా, బెల్లంపెల్లి, కన్నాల బస్తీలో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రేరణతో కార్మిక వర్గ పోరాటం పారంభమైందంటే అందుకు రెండు పిడికిళ్ళు బిగించిన వాళ్ళు గజ్జల గంగారామ్, కటకం సుదర్శనం. కన్నాల బస్తీ అంటే కార్మికవాడ. ఆ వాడలో బెల్లంపెల్లి విప్లవోద్యమ తల్లిగా పిలుచుకునే లక్ష్మమ్మకు పీపుల్స్‌వార్ దండకారణ్య పర్‌స్పెక్టివ్ విప్లవాచరణ ప్రారంభకాలంలోనే అమరుడైన గజ్జల గంగారామ్ కన్నకొడుకు అయితే ఈ 31న అమరుడైన కటకం సుదర్శన్ (69) పెంచుకున్న కొడుకు అనవచ్చు. ఆమె
మందరపు హైమావతి రెండు కవితలు
1 గెలుపు గుర్రాలం ఇక వెనకడుగులన్నీ ముందడుగులే కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు 'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి ఎంగిలాకులు ఎత్తించిన కటిక
కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్ వంటి రేటింగ్ సంస్థలు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం
అవిశ్రాంత యోధుడు
ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.
హజర్ దిన్ మేరా ప్యార్ ఉమర్ మియా..
"జనగన మన" పాడకుండా ఉంటే దేశ ద్రోహి అయ్యే ఫాసిస్ట్ దేశంలో నీవు జాతి కోసం గొంతెత్తవు మనల్ని మనుషులుగా గుర్తించని నేల లో మనకు స్వేచ్ఛ కావలన్నావ్.. ద్వేషం కక్కే హిందూ మతోన్మదాం పై ప్రేమ గెలవాలన్నావ్.. జీవించే,మాట్లాడే హక్కును చిదిమేసిన నగ్నపు రాజ్యానికి నీ మాట తూటాల కనిపించింది.. నిన్ను "హజర్ దిన్" బందీ చేసి తాను గెలిచాను అనుకుంటుంది.. తనకు తెలీదు అది ని ముందు మొకరిల్లిందని... ( ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ ఉమర్ ఖలీద్ ని బందీ చేసి 1000 రోజులు అవుతున్న సందర్భంగా)