రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?
రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది. ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు. దాడులుకు గురి అయింది ముస్లింలు, చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడులకు వున్న రాజకీయ ప్రాధాన్యత