వ్యాసాలు

UAPA = National security to Individual Terror Tag

( Immediately release all political prisoners Withdraw all illegal UAPA cases filed against leaders of Mass organizations, intellectuals, Repeal the UAPA.) DharnaOn 29th August. At Dharna Chowk, Indira Park, Hyderabad.From 10 AM. UAPA How it started UAPA was born in 1967. Under Indira Gandhi's government. Right after the 1962 war with China. Back then it was not really an anti-terror law. It was mainly about banning associations and organisations that
వ్యాసాలు

అసహనానికి పరాకాష్ట బిసిఐ చైర్మన్ తీరు

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యా రంగ సమస్యలపై తమ గొంతు వినిపిస్తున్న విద్యార్థులను భారత ప్రభుత్వం తీవ్రంగా అణచి వేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని అడిగినప్పుడు గానీ, రాజ్యాంగానికి లోబడి తమకున్న భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు గానీ భాజపా, ఆర్ ఎస్ ఎస్ అనుకూల వ్యక్తులు, ఎబివిపి వంటి రైట్ వింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే సంఘ్ పరివార్ మద్దతు దారులు, భాజపా ప్రజాప్రతినిధులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని సోషల్ మీడియాలో విదేశీయులుగా,రాజద్రోహుళుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా భౌతిక చర్యలకు పాల్పడుతూ భయపెడుతున్నారు. ఇదంతా కాషాయ భావజాలాన్ని కాపాడుతూ ఆ
వ్యాసాలు

విప్లవ శాస్త్ర మేధ- ఎంగెల్స్ !

"మార్క్స్ గురించి చెప్పకుండా ఎంగెల్స్ గురించి మాట్లాడటం అసాధ్యం. వారి జీవితాలు ఒక  అల్లికలా ఎంతగా కలగలిసిపోయాయంటే , అది ఒకే జీవితమా అన్నంతగా ." - పాల్ లాఫార్గ్ ఫెడ్రిక్  ఎంగెల్స్ మరణంపై రాస్తూ లెనిన్ - "ఎంతటి జ్ఞానజ్యోతి ఆరిపోయింది! ఎంతటి గొప్ప హృదయ స్పందన ఆగిపోయింది”.  ఆయన మరణించి 131 సంవత్సరాలు గడిచినా, ఆయన ఆలోచనల రూపంలో ఆ జ్ఞానజ్యోతి నేటికీ ప్రకాశిస్తూనే ఉంది.  ఫెడ్రిక్  ఎంగెల్స్ 1820 నవంబర్ 28న నేటి జర్మనీలోని వుప్పెర్టాల్ (అప్పటి ప్రష్యా) లో జన్మించాడు. విద్యార్థి రోజుల నుంచే తను  రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. మార్క్స్
వ్యాసాలు

కాక్రోచ్ ఉద్య‌మం: ప్రశ్న-ప్రతిఘటన

ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి "ప్రశ్నించడం”.  ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో భావప్రకటన స్వేచ్ఛ రూపంలో స్పష్టంగా ఆవిష్కృతమైంది. కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకోవడానికి బదులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తూ, చివరకు వారి గొంతు నొక్కేలా భౌతిక దాడులు, దారుణమైన హత్యల సంస్కృతిని నిర్మొహమాటంగా అమలు చేస్తోంది. ఇటీవ‌లి కాక్రోచ్ యువ‌త‌రం ఉద్య‌మం మ‌న స‌మాజ‌పు స్థితిని, అవ‌స‌రాన్ని సూచిస్తోంది. దాన్ని ఒకానొక విడి ఉద్య‌మంగాకాక మ‌న స‌మాజపు స్థితిగ‌తుల్లో భాగంగా, ప్ర‌జా పోరాట వ్య‌క్తీక‌ర‌ణ‌ల్లో భాగంగా చూస్తూనే దాని ప్ర‌త్యేక‌త‌లు వివ‌రించాల్సి
వ్యాసాలు

జన్ – జెడ్ ఉద్యమానికి తోడైన జన్ -ఆల్ఫా.

2026 జూలై 25న కేంద్రమంత్రులకు, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ప్రతినిధులకు మూడవ దఫా చర్చలు సంతృప్తిగా జరగడం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమం తాత్కాలికంగా విరమణ జరిగింది. అయితే తదనంతరం కేంద్ర ప్రభుత్వం అప్పటి  ఒప్పందంలోని  ఏ అంశం పైన చిత్త శుద్ధితో వ్యవహరించలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంలోను, విద్యార్థులపై నమోదు కాబడిన ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవడంలో గాని ఆ ఒప్పందం అమలు కాలేదు. ఇక పరీక్షల అక్రమాలను అరికట్టే
వ్యాసాలు

మానవ మూల్యంతో గూగుల్ ఏఐ విస్తరణ

దాదాపు ఆరు నెలలుగా రేల్లి రామకృష్ణ జీడిమామిడి, మామిడి, ఆయా కాలాల్లో పండే  కూరగాయలను సాగు చేస్తూ తన జీవితంలో అత్యధిక భాగాన్ని గడిపిన తనకి ఉన్న చిన్న పొలానికి రోజూ వెళ్లడం లేదు. ఇప్పుడు ఆమె ఉదయాలు నిశ్శబ్దమైన, విసుగుపుట్టించే దినచర్యతో గడిచిపోతున్నాయి. ఆమె ఇంట్లోనే ఉంటూ, రోజు ముగియడానికి చాలా ముందే పూర్తయ్యే ఇంటి పనులను చేసుకుంటోంది. "నాకు చేయడానికి ఏమీ మిగలలేదు," అని అంటోంది. "ఆ పొలమే నా పని. అక్కడే నేను నా సమయాన్ని గడిపేదాన్ని." దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం శివార్లలో ఉన్న తర్లువాడ గ్రామంలోని ఈ భూమిని, మూడు
వ్యాసాలు

గోండీ భాషను నిలుపుకుందాం

గోండీ-కోయ, గోండ్-కోయ ఆదివాసీ ప్రజలు మాట్లాడే భాష. తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్, అసిఫాభాద్ జిల్లాలలో, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం అవిభాజిత బస్తర్ జిల్లాలలో, మహారాష్ట్ర గఢ్ చిరోలి జిల్లాలో ప్రధానంగా మాట్లాడే ఈ భాష భారతదేశంలో ఉన్న వందల ఆదివాసీ భాషలలో ఒకటి. ఏ భాషకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్యకర్తగా ఒక ఆదివాసీ భాషతో ఏర్పడిన పరిచయంతో దాని గురించి రాయాలని అనిపించింది. గోండీ భాషను కోయ భాష అని కూడా అంటారు. గోండ్ జాతి, కోయ జాతి అనేవి ఒకే జాతికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు. నా మాతృభాష తెలుగు. కాబట్టి తెలుగుతో
వ్యాసాలు

అడవులను, ఆదివాసీలను కాపాడుకుందాం

ప్రతి ఏడాది ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ హక్కుల దినం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ వారి సంరక్షణ కోసమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 49/214 అనే తీర్మానాన్ని 23 డిసెంబర్ 1994 న చేసి ప్రతి ఏటా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. ఈ తీర్మానానికి ఆహ్వానంలో పాల్గొన్న 143 దేశాలలో 125 దేశాలు ఆమోదించాయి. 14 మంది తటస్త వైఖరి తెలుపగా, నలుగురు వ్యతిరేకించారు. ఆనాటి నుండి ఆదివాసీల హక్కులు వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు
వ్యాసాలు

ఇది న్యాయం తప్ప మరేదైనా కావచ్చు

రాజస్థాన్‌లోని దంగావాస్ దళిత మారణకాండ కేసులో నిందితులైన 40 మందిని నిర్దోషుల విడుదల 2026 ఆగస్టు 10 2015 డాంగావాస్ హింస: 40 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టిన రాజస్థాన్ ప్రత్యేక కోర్టు 2015 నాటి డాంగావాస్ హింస తీవ్రమైన "ఘోరమైన" దాడి అని గుర్తించినప్పటికీ, రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఐదుగురు దళితులతో సహా ఆరుగురి మరణానికి ఎవరు బాధ్యులో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడానికి పోలీసులు, సిబిఐ దర్యాప్తులోని తీవ్ర లోపాలే కారణమని కోర్టు వేలెత్తి చూపింది. ఆరుగురు, అందులో ఐదుగురు దళితులు, దారుణంగా హత్యకు గురైన, డాంగావాస్ మారణకాండ జరిగిన
వ్యాసాలు

పుస్తకాలే నన్నుసృజనకారుడిగా నిలబెట్టాయి – అవినేని భాస్కర్

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి? అక్షరాలు చదవడం నేర్చుకోక ముందే పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఇంట్లో తాత, అమ్మ, నాన్న మిగిలిన పెద్దవాళ్ళందరూ పుస్తక ప్రియులే. మామూలుగా పిల్లలకి పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉండటం కద్దు, మా ఇంట్లో పుస్తకాలు పట్టుకుని కథలు, పద్యాలు చదివి వినిపించేవాళ్ళు. తొండనాడు ప్రాంతంలో పుట్టడంవల్ల ఇంట్లోనూ, ఇంటి బయటా ద్విభాషా వాతావరణమే ఉండేది - మార్గళి (అంటే మార్గశిరము) నెలంతా తెల్లవారుజామున వైష్ణవ పద్యాలు, పాటలు పాడుతుండేవాళ్ళు. సాయంత్రం కాగానే భాగవత పఠనం ఉండేది - పెద్దవాళ్ళు ఎవరో ఒకరు భాగవతం పుస్తకం